నర్సంపేట, అక్టోబర్ 1: సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ అభివృద్ధిలో పరుగులు తీస్తున్నదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి స్పష్టంచేశారు. శుక్రవారం వరంగల్ జిల్లా నర్సంపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చెన్నారావుపేట మాజీ ఎంపీపీ జక్క అశోక్సహా కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు వెయ్యి మంది ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.