నేరేడ్మెట్, అక్టోబర్ 15: ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనే తెలంగాణకు శ్రీరామరక్ష అని ఎంబీసీ చైర్మన్ నందికంటి శ్రీధర్ అన్నారు. ఆదివారం నేరేడ్మెట్ డివిజన్ శ్రీకాలనీలోని పార్టీ కార్యాలయంలో మల్కాజిగిరి బీఆర్ఎస్పార్టీ సీనియర్ నాయకుడు బద్దం పరశురాంరెడ్డి ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎంబీసీ చైర్మన్ నందికంటి శ్రీధర్ మాట్లాడుతూ.. ప్రతి కార్యకర్తను బీఆర్ఎస్ హక్కున చేర్చుకుంటుందని, బీఆర్ఎస్ పార్టీ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. తెలంగాణలో ప్రతిపక్షాలకు చోటులేదన్నారు.
పార్టీలో పని చేసే ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు.
ఈ కార్యక్రమంలో కృష్ణమూర్తిగౌడ్, రంపె చంద్రమౌళి, ఎంఆర్ శ్రీనివాస్ యాదవ్, గుంటి రాంచందర్, ఫరీద్, కరీం, ప్రభాకర్ రెడ్డి, బాలకృష్ణ గుప్త, ఉమేష్ కుమార్, పేపర్ శ్రీనివాస్, గోపాల్, శ్రీదేవి, అరుంధతి, సత్యలక్ష్మి, అరుణ, పాషా, అజయ్, బాపు, సుధాకర్చారి, ధర్మేష్ యాదవ్, మల్లేష్ చారి, వెంకటేష్చారి, రఫీక్, ఖాదర్, వెంకటేష్, జోసెఫ్, సాయికుమార్, దుర్గాసాయి, జేడీ సాయి తదితరులు పాల్గొన్నారు.