మహబూబాబాద్ : సీఎం కేసీఆర్(CM KCR) పాలన ఈ రాష్ట్రానికి శ్రీరామరక్ష. రాష్ట్రంలోని పేదల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్(Minister Sathyavathi) అన్నారు. గూడూరు మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఈటల రాజేందర్‌కు గుర్తింపు ఇచ్చి క్యాబినెట్లో హోదా కల్పిస్తే పార్టీకి ద్రోహం చేశారు. బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా ఫీలవుతున్న ఈటల ఇష్టం వచ్చిన హామీలు ఇస్తున్నారు.
ఈటల రాజేందర్ వ్యక్తిగత హామీలను ప్రజలు నమ్మరన్నారు. బీసీలకు అన్యాయం చేసింది బీజేపీ, కాంగ్రెస్ పార్టీలని మండిపడ్డారు. దేశాన్ని 75 ఏండ్లు పాలించింన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు బీసీలకు, దళితులకు ఉపయోగపడే ఒక్క సంక్షేమ పథకం ప్రవేశపెట్టక పోవడం సిగ్గుచేటన్నారు. తండాలను గ్రామపంచాయతీలు చేసి, గిరిజన రిజర్వేషన్ 10 శాతం పెంచి, పోడు భూముల పట్టాలు అందించిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అని ప్రశంసించారు.
కాంగ్రెస్ పార్టీకి దేశంలో గ్యారంటీ లేదు. ఆ పార్టీ నాయకులకు ఇచ్చే హామీలకు గ్యారెంటీ ఉండదని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ కృషితో మానుకోట అభివృద్ధి చెందింది. కాంగ్రెస్ అభ్యర్థిగా మురళి నాయక్తది పదవీ వ్యామోహం తప్పా పేదలకు సాయం చేయాలనే ఆలోచన లేదు. వీరి పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఈ ప్రాంత అభివృద్ధికి అహర్నిశలు కృషి చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి శంకర్ నాయక్‌ను భారీ మోజార్టీతో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మాలోత్ కవిత, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బీరవెల్లి భరత్ కుమార్ రెడ్డి, మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి మండల కో ఆప్షన్ మెంబర్ ఖాసీం, ఎంపీటీసీ సురేందర్ తదితరులు పాల్గొన్నారు.