కేతేపల్లి, నవంబర్ 25: ఎన్నికల్లో ప్రజలంతా ఆలోచించి మూడోసారి బీఆర్ఎస్ పార్టీకి పట్టం క ట్టాలని అంధుల అ ఖిల భారత సంఘాల సమాఖ్య ఉపాధ్యక్షుడు (ఏఐసీబీ), డ్వాబ్ ప్రధాన కార్యదర్శి పొనుగోటి చొక్కారావు పిలుపునిచ్చారు. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం చీకటిగూడెంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. 50 ఏండ్లపాటు అధికారంలో ఉండి అభివృద్ధి చేయలేని కాంగ్రెస్ నాయకులు మరోసారి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరడం సరికాదని చొక్కారావు అన్నారు. కాంగ్రెస్కు ఓటువేస్తే.. ‘మన కంటిని మనమే పొడుచుకోవడమే’నని తెలిపారు. కుర్చీల కోసం పోరాటం తప్పితే వారికి ప్రజా సంక్షేమంపై ధ్యాస ఉండదని అన్నారు. ఓట్ల సమయంలో మాత్రమే కనిపించే కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దని కోరారు. రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులకు పెన్షన్ పెంచి ఆదుకున్న మహానీయుడు సీఎం కేసీఆర్ అని చొక్కారావు కొనియాడారు.