విమర్శలకు అభివృద్ధితోనే సమాధానం : మంత్రి గంగుల
మంత్రి గంగుల | ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని, వారికి అభివృద్ధితోనే సమాధానం చెబుతామని బీసీ సంక్షేమం శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

కరీంనగర్ : ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని, వారికి అభివృద్ధితోనే సమాధానం చెబుతామని బీసీ సంక్షేమం శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్లో మంత్రి పర్యటించారు. నగరంలోని 21వ డివిజన్ లో 24 లక్షలు, 40వ డివిజన్ లో రూ.32 లక్షల ప్లాన్ గ్రాంట్ నిధులతో నిర్మించబోయే సీసీ రోడ్డు పనులకు మేయర్ సునీల్ రావుతో కలిసి భూమిపూజ నిర్వహించి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ..కరోనాతో యావత్ ప్రపంచం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నది. చాలా దేశాల్లో అభివృద్ధి ఎక్కడికక్కడే నిలిచిపోయిందన్నారు.
ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. తెలంగాణలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఆగిపోవడం లేదని మంత్రి తెలిపారు. ప్రజలు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయకుండా కరీంనగర్ అభివృద్ధే ధ్యేయంగా కృషి చేస్తున్నామన్నారు. గడిచిన 7 సంవత్సరాల కాలంలో కరీంనగర్ రూపు రేఖలు పూర్తిగా మార్చేశామని తెలిపారు. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ది చేసి చూపిస్తామన్నారు.
ఎన్ని ఆటంకాలు ఎదురైనా అభివృద్ధి ఆగొద్దనే సదుద్దేశంతో సీఎం కేసీఆర్ సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారని మంత్రి ప్రశంసించారు. ప్రజలకు ఏ మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం అభివృద్ధి చేస్తున్నామన్న మంత్రి గంగుల తెలిపారు. త్వరలో నగరంలో మిగిలిన సమస్యలను పరిష్కరించి కరీంనగర్ను సుందరనగరంగా తీర్చిదిద్దుతామన్నారు.
కరీంనగర్ మన నగరమని… నగరంలో జరుగుతున్న అభివృద్ది నగరవాసులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం తమతమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని ఆరోగ్యనగరంగా తీర్చిదిద్దుకోవాలన్నారు.
ఇవి కూడా చదవండి..
కార్మికులకు అండగా నిలిచిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
భూమికి బరువయ్యేంత పంట పండిస్తాం : మంత్రి హరీశ్ రావు
దివ్యాంగులకు బ్యాటరీతో నడిచే ట్రై సైకిళ్ల పంపిణీ
ఎంపీ వెంకటేష్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ కవిత
ఐసోలేషన్ సెంటర్ను ప్రారంభించిన ఎమ్మెల్యే కిషోర్ కుమార్
200 కోట్ల డాలర్లు విరాళం ఇచ్చిన జెఫ్ బెజోస్ మాజీ భార్య
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

