e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, October 26, 2021
Home News 200 కోట్ల డాల‌ర్లు విరాళం ఇచ్చిన జెఫ్ బెజోస్‌ మాజీ భార్య‌

200 కోట్ల డాల‌ర్లు విరాళం ఇచ్చిన జెఫ్ బెజోస్‌ మాజీ భార్య‌

న్యూయార్క్‌: అమెజాన్ సంస్థ వ్య‌వ‌స్థాప‌కుడు జెఫ్ బేజోస్ మాజీ భార్య మెకంజీ స్కాట్ మ‌రోసారి భారీ విరాళం చేశారు. తాజాగా ఆమె సుమారు 200 కోట్ల (2.7 బిలియ‌న్ల డాల‌ర్ల) డాల‌ర్ల మొత్తాన్ని వివిధ ఛారిటీల‌కు అంద‌జేశారు. త‌న బ్లాగ్ పోస్టులో ఆమె ఈ విష‌యాన్ని చెప్పారు. ఎన్నాళ్లుగానో ఫండింగ్‌కు నోచుకోని, ప‌ట్టించుకోని.. స్వ‌చ్ఛంద సేవా సంస్థ‌ల‌కు తన సంప‌ద‌ను దానం చేసిన‌ట్లు మెకంజీ స్కాట్ తెలిపారు. వ‌ర్ణ అస‌మాన‌త‌లు, క‌ళ‌లు, విద్యా రంగాల కోసం ప‌నిచేస్తున్న సుమారు 286 సంస్థ‌ల‌కు త‌న డ‌బ్బును విరాళం ఇచ్చిన‌ట్లు ఆమె చెప్పారు. జెఫ్ బేజోస్‌తో 2019లో ఆమె విడాకులు తీసుకున్నారు. ఆ విడాకుల ద్వారా వ‌చ్చిన భ‌ర‌ణం వేల కోట్ల‌ల్లో ఉన్న‌ది. దాంతో ఆమె ప్ర‌పంచ సంప‌న్నురాలిగా మారింది. బేజోస్‌తో జ‌రిగిన ఒప్పందం ప్రకారం.. అమెజాన్ షేర్లు నాలుగు శాతం స్కాట్‌కు ద‌క్కాయి. 1994లో అమెజాన్ సంస్థ ఏర్పాటు విష‌యంలో బేజోస్‌కు మెకంజీ స్కాట్ తోడ్ప‌డ్డారు. గ‌త నాలుగు నెలల్లో ఆమె సుమారు నాలుగు బిలియ‌న్ల డాల‌ర్ల సొమ్మును డోనేట్ చేశారు. ఫోర్బ్స్ లెక్క‌ల ప్ర‌కారం 59.5 బిలియ‌న్ల డాల‌ర్ల సంప‌ద‌తో.. ప్ర‌పంచ కుబేరుల జాబితాలో ఆమె 22వ స్థానంలో ఉన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement