మహబూబాబాద్ : సీఎం కేసీఆర్ మహబూబాబాద్‌ను జిల్లాగా చేయడం వల్లే ఈ రోజు ఇంత అభివృద్ధి జరిగిందని రాష్ట్ర ప్రణాళిక సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.
మహబూబాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు.
కేసీఆర్ 2001 నుంచే తెలంగాణ గురించి పూర్తిగా అధ్యయనం చేశారన్నారు. మెడికల్ కళాశాల త్వరగా పూర్తి చేసి వచ్చే సంవత్సరం ప్రారంభిస్తామన్నారు. 14 ఏండ్ల క్రితమే బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అనే నినాదం ఇచ్చిన పార్టీ టీఆర్ఎస్ అని గుర్తు చేశారు.
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఉక్కు ఫ్యాక్టరీ గురించి క్లుప్తంగా ఉందన్నారు. బయ్యారంలో 100 కోట్ల టన్నుల ఐరన్ నిక్షేపాలు ఉన్నాయని, ఉక్కు పరిశ్రమకి అనుకూలంగా ఉందని ఎన్ఎండీసీ స్పష్టం చేసిందన్నారు.
బీజేపీ ప్రభుత్వం పరిశ్రమ పెట్టడానికి చేతకాక బయ్యారం ఉక్కును అనుమానిస్తుందన్నారు.
రేవంత్ రెడ్డి ఉపయగించే భాషా విధానాన్ని ప్రజలు గమనిస్తున్నారని వినోద్ కుమార్ తెలిపారు. అసత్య ప్రచారాలు చేస్తున్న వివిధ పార్టీల పట్ల ఇన్నాళ్లు మౌనంగా ఉన్నాం. ఇక ఇప్పటి నుంచే ఊరుకునేది లేదన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్,ఎమ్మెల్సీ రవీందర్ రావు, నాగుర్ల వెంకటేశ్వర్లు, బీరవెల్లి భరత్ కుమార్ రెడ్డి ఉన్నారు.