కాసిపేట : మండలంలోని దేవాపూర్, కాసిపేట మేజర్ పంచాయతీలు, ముత్యంపల్లి, పెద్దనపల్లి గ్రామ పంచాయతీల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను ( BRS Candidates ) గెలిపిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ( Durgam Chinnaiah ) స్పష్టం చేశారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని దేవాపూర్ లో మడావి అనంత రావు, ముత్యంపల్లిలో కోవ సింధు, పెద్దనపల్లిలో కల్వల శరత్ అభ్యర్థుల తరుపున చేసిన ప్రచారంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దేవాపూర్, ముత్యంపల్లి, పెద్దనపల్లిలో భారీ ర్యాలీ తీశారు. దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధి అందరికీ తెలుసునని, వచ్చేది మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే రెట్టింపు సంక్షేమ పథకాలు మళ్లీ వస్తాయని పేర్కొన్నారు. ప్రజలందరూ బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని పిలుపు నిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బొల్లు రమణారెడ్డి, మాజీ జడ్పీటీసీ పల్లె చంద్రయ్య, మాజీ ఎంపీటీసీ కొండబత్తుల రాంచందర్, మాజీ సర్పంచ్ ఆడె బాదు, మాజీ ఉప సర్పంచ్ బోయిని తిరుపతి తదితరులు పాల్గొన్నారు.