Devadula Pipeline | వరంగల్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సాగునీటి నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యం రైతులకు శాపంగా మారింది. దేవన్నపేట పంప్‌హౌస్ మోటర్లు రెండు రోజులు నడిచి ఆగిపోయాయి. పంపింగ్ చేసిన నీరు టన్నెల్ నుంచి భారీగా లీకై పొలాల్లోకి వస్తుండటంతో అధికారులు మోటర్లను మళ్లీ నిలిపివేశారు. పంపింగ్ మోటర్లను నిలిపివేయడం వారంలోనే ఇది రెండోసారి. ఇప్పట్లో పంపులను ఆన్ చేసే పరిస్థితి లేదని, లీకేజీలకు మరమ్మతులు చేసేందుకు వారాలు పడుతుందని అధికారులు చెప్తున్నారు. సరైన ఏర్పాట్లు చేయకుండానే మంత్రులు మోటర్లను ఆన్ చేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం టన్నెల్‌లోని నీటిని ఖాళీ చేయిస్తున్నారు.