Parigi | పరిగి, ఆగస్టు 10: చెంబులో ఒక్క ఉంగ రం వేసి.. దేవుడి దగ్గరపెట్టి మరుసటి రోజు చూస్తే రెండు ఉంగరాలు అవుతాయని ఓ హో టల్ యజమానిని మోసగించేందుకు యత్నించిన దొంగబాబాలకు గ్రామస్థులు దేహశుద్ధి చేశారు. అనంతరం వారిని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన శనివారం వికారాబాద్ జిల్లా పరిగి మండలం నస్కల్ గ్రామంలో చోటుచేసుకుంది. నస్కల్ గ్రామంలో మాలికాడి శ్రీధర్ హోటల్ నడిపిస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం నలుగురు వ్యక్తులు హోట ల్కు వచ్చారు. ముగ్గురు కాషాయ దుస్తులు ధరించి స్వామీజీల్లా ఉన్నారు.
భోజనం చేశాక యజమాని వారిని డబ్బులు అడిగితే.. ‘మేము స్వామీజీలం, మమ్మల్ని డబ్బులు అడగొ ద్దు, మీకు అంతా మంచి జరిగేలా చేస్తాం’ అని నమ్మబలికారు. చిన్న చెంబులో నీళ్లు తీసుకురమ్మన్న స్వామీజీలు.. శ్రీధర్ బంగారు ఉంగరాన్ని అందులో వేయించారు. ఆ చెంబుకు తెల్లటి వస్త్రం కట్టి దేవుడి ముందు ఉంచాలని, దానిని మరుసటి రోజు (ఆదివారం) చూస్తే.. రెండు ఉంగరాలు అవుతాయని శ్రీధర్‌కు చె ప్పారు. దీంతో చెంబులో చూడగా రాయి ఉన్నది. తనను ఎందుకు మోసం చేశారని ప్రశ్నించగా.. శూలాన్ని శ్రీధర్‌పైకి విసిరారు. శ్రీధర్ తప్పించుకొనే క్రమంలో కిందపడిపోగా ఎడమచేతికి గాయమైంది. వెంటనే గ్రామస్థులు వారిని చితకబా ది పరిగి పోలీసులకు అప్పగించారు. వారు రాజస్థాన్ రాష్ర్టానికి చెం దిన రావత్నాథ్, మిట్టనాథ్, మేఘనాథ్, డ్రైవ ర్ రాజేందర్‌గా పోలీసులు గుర్తించారు. వారిపై కేసు నమోదు చేశారు.