హైదరాబాద్ : తెలంగాణ వీరనారి, సాయుధ పోరాట యోధురాలు చిట్యాల (చాకలి) ఐలమ్మ జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కృతజ్ఞతగా ఆమె కుటుంబ సభ్యులు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధ్వర్యంలో ప్రగతి భవన్లో గురువారం సీఎం కేసీఆర్ కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వారితో మాట్లాడారు. ఐలమ్మ చరిత్రను కూడా రికార్డు చేయాలని, వారికి, వారి కుటుంబానికి సంబంధించిన వివరాలు మరిన్ని కావాలని చెప్పారు. తెలంగాణ వచ్చాకే ఐలమ్మకు తగిన గుర్తింపు, గౌరవాలు దక్కాయన్నారు. ఇందుకు సీఎం కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లికి కృతజ్ఞతలు తెలిపారు.
సీఎంని కలిసిన వారిలో మంత్రులు ఎర్రబెల్లి, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే అరూరి రమేశ్‌తో పాటు ఐలమ్మ వారసులు పాలకుర్తి మాజీ సర్పంచ్ చిట్యాల రామచంద్రం, వారి కొడుకు చిట్యాల సంపత్ – చిట్యాల శ్వేత మనుమడు, మనుమరాళ్లు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
Road accident |యాదాద్రి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
నిందితుడు రాజు చేతులపై పచ్చబొట్టు ఎవరిదో తెలుసా?
నా చుట్టూ డజన్ల సంఖ్యలో కరోనా సోకినవాళ్లే ఉన్నారు: వ్లాదిమిర్ పుతిన్
Nusrat Jahan: ఎట్టకేలకు తన బిడ్డ తండ్రి ఎవరో చెప్పిన అందాల నటి