కోటపల్లి, జూలై 4 : పట్టా పాసుపుస్తకం కోసం లంచం డిమాండ్ చే సిన డిప్యూటీ తహసీల్దార్‌తో పాటు అటెండర్ని ఏసీబీ అధికారులు శుక్రవారం పట్టుకున్నారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రాజారం లో గుంట లక్ష్మయ్యకు 20 గుంటల భూమి ఉంది. ఆధార్ సరిగా లేని కారణంగా ఈ భూమికి పట్టాపాస్‌పుస్తకం రాలేదు. దీంతో లక్ష్మయ్య కొ డుకు డీటీ నవీన్‌ను సంప్రదించగా, రూ.15 వేల లంచం ఇస్తేనే పట్టా చేస్తామని నవీన్ చెప్పడంతో రూ.10 వేలకు బేరం కుదుర్చుకుని, అక్కడ అటెండర్ అంజన్నకు అందజేశారు. అ డబ్బులను డిప్యూటీ తహసీల్దార్ నవీన్ తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇద్దరిని కోర్టులో హాజరుపర్చనున్నట్టు ఏసీబీ డీఎస్పీ మధు తెలిపారు.