హైదరాబాద్ : సైబర్ నేరగాళ్లు మోసాలు రోజు రోజుకు మరింత పెరుగుతున్నాయి. ఇప్పటికే ఎంతో మంది కేటగాళ్లు బారినపడి లక్షల్లో డబ్బును మోసపోగా.. తాజాగా కామారెడ్డి జిల్లాల్లో పని చేస్తున్న ఓ డెప్యూటీ తహసీల్దార్ సైతం నేరగాళ్ల బారినపడ్డారు. ఈ-కేవైసీ పేరుతో సైబర్ నేరగాళ్లు కామారెడ్డి కలెక్టరేట్లో డిప్యూటీ తహసీల్దార్‌గా పని చేస్తున్న రంజిత్‌కు రూ.3.40లక్షలు టోకరా వేశారు. వెంటనే అప్రమత్తమైన ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ల కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచనలు చేస్తూ అవగాహన కల్పిస్తున్నా సైబర్ నేరగాళ్ల ఎత్తులకు జనం మోసపోతున్నారు.