హైదరాబాద్, సెప్టెంబర్ 11(నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో హైడ్రా పనితీరు బాగుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ప్రశంసించారు. జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్‌రెడ్డిని బుధవారం కలిశారు. వరద బాధితుల సహాయార్థం రూ.కోటి చెక్కును సీఎంకు పవన్ అందజేశారు.
ఈ సందర్భంగా హైడ్రా విధి విధానాలపై పవన్ ఆరా తీశారు. ఎన్ కన్వెన్షన్ కూల్చిన వెంటనే నాగబాబు స్పందించడం, తాజాగా హైడ్రా చర్యలను పవన్ ప్రశంసించడంపై సినీవర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.