హైదరాబాద్, డిసెంబర్ 12 : రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క(Deputy CM Mallu Bhatti Vikramarka)ను మంగళవారం డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం(Secretariat)లో పలువురు ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు కలసి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలియజేశారు. అలాగే ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మతో పాటు ఆశాఖ ఉన్నతాధికారులు మంత్రిని కలసి అభినందనలు తెలిపారు.
రాష్ట్రాభివృద్ధిలో అందరూ కలిసికట్టుగా పని చేయాలని డిప్యూటీ సీఎం సూచించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక శాఖ రూపొందించిన ‘తెలంగాణ స్టేట్ ఎట్ ఏ గ్లాన్స్’(Telangana State at a Glance) అనే పుస్తకాన్ని మంత్రి బట్టి విక్రమార్క ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, తదితరులు పాల్గొన్నారు.