మామిళ్లగూడెం, డిసెంబర్ 7 : ఖమ్మంలోని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క క్యాంపు కార్యాలయంలో రో డ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన అదనపు భవనానికి డిప్యూటీ సీఎం సతీమణి, అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని శనివారం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, అనుబంధ సంఘాల నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆరు నెలల క్రితం రూ.90 లక్షలతో ఖమ్మం వీడీవోస్ కాలనీ ప్రజా భవన్ క్యాంపు కార్యాలయంలో మరో ఆధునిక భవనాన్ని నిర్మించేందుకు నిధులు మంజూరు చేసింది. ఈ భవనంలో సెక్యూరిటీ కోసం ప్రత్యేకంగా నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం ఆ విభాగం నిర్మాణంలో ఉన్నదని ఆర్అండ్బీ డీఈఈ చంద్రశేఖర్ తెలిపారు. ప్రభుత్వ సాధారణ నిధులతో నిర్మించిన భవనాన్ని అనధికారికంగా కాంగ్రెస్ నాయకుల చేత ప్రారంభించడం చర్చనీయాంశంగా మారింది.