హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న రాజీవ్ యువ వికాసం లబ్ధిదారులకు మంజూరు లెటర్ల పంపిణీ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార ఆదేశించారు. జూన్ రెండు నుంచి తొమ్మిది వరకు అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించాలని సూచించారు. మంగళవారం సచివాలయంలో రాజీవ్ యువ వికాసం పథకంపై డిప్యూటీ సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లబ్ధిదారులకు జూన్ 10 నుంచి 15 వరకు శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు.
జూన్ 15 తర్వాత గ్రౌండింగ్ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. అక్టోబర్ రెండు నాటికి లక్ష్యంగా పెట్టుకున్న ఐదు లక్షల మంది యువతకు స్వయం ఉపాధి కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి నెలా ఈ కార్యక్రమం చేపట్టి దశలవారీగా పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా, ఎస్సీ కార్పొరేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, బీసీ సంక్షేమశాఖ కమిషనర్ బాల మాయాదేవి, మైనార్టీ సంక్షేమశాఖ కమిషనర్ యాస్మిన్ భాషా, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాసర్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిషారానికి ఇటీవల ప్రభుత్వం ముగ్గు రు ఉన్నతాధికారులతో ఏర్పాటుచేసిన త్రిసభ్య కమిటీ.. సబ్‌కమిటీ చైర్మన్ మల్లు భట్టి విక్రమారతో భేటీ అయ్యింది. ఉద్యో గ సంఘాలు లేవనెత్తిన సమస్యలను భట్టికి సీసీఎల్ఏ కార్యదర్శి నవీన్‌మిట్టల్, పంచాయతీరాజ్ సెక్రటరీ లోకేశ్‌కుమార్, ట్రాన్స్ కో సీఎండీ కృష్ణ భాసర్ వివరించారు.