CPRO | ఉపముఖ్యమంత్రి సీపీఆర్వో గుండెపోటుతో మృతి
CPRO | ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ మారబోయిన మధుసూదన్ గుండెపోటుతో మరణించారు.
హైదరాబాద్ : ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ( CPRO ) మారబోయిన మధుసూదన్ ( Madhusudan ) గుండెపోటు ( Heart Attack) తో మరణించారు. సోమవారం మధ్యాహ్నం చాతి నొప్పితో అపోలో స్పెక్ట్రా ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగానే మరో మారు కార్డియాక్ అరెస్ట్ కావడంతో కన్నుముశారు. గతంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి సంస్థలలో సీనియర్ జర్నలిస్టుగా కీలక బాధ్యతలను నిర్వహించారు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు.
మధుసూదన్ మృతి పట్ల ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అత్యంత నిజాయితీ గల పాత్రికేయన్ని కోల్పోవడం బాధాకరంగా ఉందని ఆయన అన్నారు. వృత్తిపట్ల మధుసూదన్ అత్యంత నిబద్ధత కలిగిన పాత్రికేయుడని కొనియాడారు. ఈ కష్ట సమయంలో ఆ కుటుంబానికి ఆత్మస్థైర్యం కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్ననని, ఆయన కుటుంబానికి అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

