హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ) : 2025-26 బడ్జెట్‌పై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. సంక్రాంతి డిప్యూటీ సీఎం, ఆర్థికమంత్రి భట్టివిక్రమార శాఖలవారీ సమావేశాలు ఏర్పాటు చేస్తారని ప్రభుత్వవర్గాలు తెలిపాయి. ఈ నెలాఖరు వరకు బడ్జెట్ అంచనాలు సిద్ధం చేయాలని నిర్ణయించినట్టు అధికారులు వెల్లడించారు. ఫిబ్రవరి మొదటివారంలో కేంద్ర బడ్జెట్లో కేటాయింపుల ఆధారంగా రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలు మార్చి, ఫిబ్రవరి మూడో వారంలో శాసనసభలో ప్రవేశపెట్టే అవకాశముంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం మారెట్ నుంచి రూ.40,909 కోట్లు రుణాలు సేకరించింది. చివరి త్రైమాసికంలో మరో రూ.30,000 కోట్లను సమీకరించేందుకు ఆర్బీఐకి ప్రతిపాదనలు సమర్పించింది. ఒక్క ఏడాదిలోనే మారెట్ రుణాలు మొత్తం రూ.70,909 కోట్లకు చేరుకున్నాయి. అదనంగా రూ.30,000 కోట్లను ఆఫ్-బడ్జెట్ రుణాలు, ప్రీమియం స్థలాలను తాకట్టు పెట్టడం ద్వారా సమీకరిస్తున్నారు.