ఈపీటీఆర్ఐతో సాంకేతిక విద్యాశాఖ ఎంవోయూ
పాలిటెక్నిక్.. ఇంజినీరింగ్ విద్యార్థులకు పర్యావరణ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు ప్రతిష్ఠాత్మక సంస్థ ఈపీటీఆర్ఐతో రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ సోమవారం ఒప్పందం కుదుర్చుకొన్నది.
హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): పాలిటెక్నిక్.. ఇంజినీరింగ్ విద్యార్థులకు పర్యావరణ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు ప్రతిష్ఠాత్మక సంస్థ ఈపీటీఆర్ఐతో రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ సోమవారం ఒప్పందం కుదుర్చుకొన్నది. ఈ మేరకు నాంపల్లిలోని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలో ఈపీటీఆర్ఐ డీజీ వాణీప్రసాద్, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్‌మిట్టల్ ఒప్పంద పత్రాలను మార్చుకొన్నారు. ఈ ఒప్పందం ద్వారా పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ విద్యార్థులకు సర్టిఫికెట్ కోర్సులు.. డిప్లొమా ప్రొగ్రామ్‌లు నిర్వహించడం, ఇంటర్న్‌షిప్, స్టార్టప్ ఐడియాలు, ఇన్నోవేషన్‌ను ప్రోత్సహించడం వంటివి అమలుచేస్తారు. అధ్యాపకులు సిబ్బందికి శిక్షణ, వర్క్‌షాప్‌ల నిర్వహణ, ప్రపంచ పర్యావరణ దినోత్సవం.. విద్యార్థులకు టెక్ఫెస్ట్లను నిర్వహించడం వంటివి చేపడుతామని అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో సాంకేతిక విద్యాశాఖ ఆర్జేడీ పుల్లయ్య, సాంకేతిక విద్యామండలి కార్యదర్శి డాక్టర్ శ్రీనాథ్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

