ప్రతి పంచాయతీలో 25 మందికి 100% ‘ఉపాధి’

గ్రామీణాభివృద్ధిశాఖ కొత్త మార్గదర్శకాలు జారీ
హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ప్రతి గ్రామ పంచాయతీలో కనీసం 25 మందికి తగ్గకుండా 100 శాతం పనులు కల్పించాలని గ్రామీణాభివృద్ధిశాఖ.. అధికారులను ఆదేశించింది. వ్యవసాయ, ఇతర పనులు పెరగడంతో ఉపాధి హామీ పనులకు కూలీల రాక తగ్గిపోయింది. ఇటీవల నిర్వహించిన సమీక్షలో ప్రతి పంచాయతీలో సగటున 10 మంది కూలీలే పనులకు హాజరవుతున్నట్టు తేలింది. ఈ పరిస్థితుల్లో వ్యూహాత్మకంగా కూలీల హాజరును పెంచడం, పనులను గుర్తించడంపై తెలంగాణ గ్రామీణాభివృద్ధిశాఖ నూతన మార్గదర్శకాలు జారీచేసింది. ఆ వివరాలు ఇలా..
- ఎంపీడీవో/ఏపీవో తన మండల ఈజీఎస్ బృందం, పంచాయతీవారీగా శ్రమశక్తి సంఘాలతో సమావేశాలు పెట్టాలి.
- షెల్ప్ఆఫ్వర్క్స్లోఉన్న పనులపై చర్చించి వాటిలో ఏ పనులు చేపట్టొచ్చు, కొత్త పనులను గుర్తించాలి.
- పంచాయతీవారీగా కొత్తగా కనీసం 20 సహజ వనరుల సంరక్షణ (ఎన్ఆర్ఎం), నీటి నిల్వ/ సంరక్షణ (వాటర్ హార్వెస్టింగ్) పనులను కచ్చితంగా గుర్తించి, పనులు మొదలుపెట్టాలి.
- ఈ పనుల అంచనాలు తయారుచేసి సాంకేతిక ఆమోదం పొందిన జాబితాను గ్రామసభలో ఆమోదించుకోవాలి. పనుల జాబితా ప్రింట్లను శ్రమశక్తి సంఘాలకు అందజేయాలి.
- ఎస్సీ, ఎస్టీసంఘాలకు ప్రాధాన్యమివ్వాలి. శ్రమశక్తి సంఘాలు కోరుకున్న పని మొదలుపెట్టి గ్రామంలో కనీసం25మంది పనిలోకి వచ్చేలా చూడాలి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

