హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ) : విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ బడుల్లో 25% ఉచిత సీట్ల అమలుకు విద్యాశాఖ ఉత్తర్వులిచ్చింది. రాష్ట్రంలోని 50 గ్రామీణ, 46 పట్టణ వార్డుల్లో ఈ సెక్షన్ కింద ఉచిత అడ్మిషన్లు కల్పిస్తామన్నది. విద్యాహక్కు చట్టం 12(1) సీ ప్రకారం కిలోమీటర్ పరిధిలో ప్రభుత్వ పాఠశాల లేకపోతే, 20 మంది కంటే తక్కువ విద్యార్థులుంటే ఆయా విద్యార్థులకు ప్రైవేట్ బడుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ విద్యార్థుల ఫీజులను సర్కారు ఫీజు రీయింబర్స్మెంట్ కింద నిధులు చెల్లిస్తుంది. ఈ పథకాన్ని రాష్ట్రంలోని 96 ప్రాంతాల్లో అమలుచేయడానికి విద్యాశాఖ ఆదేశాలిచ్చింది. ట్రస్మా నేతలు హర్షం వ్యక్తంచేశారు.
ప్రభుత్వ దవాఖానల్లో సౌకర్యాలు మెరుగుపర్చండి ; బాలల హకుల కమిషన్ ఆదేశం
హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ దవాఖానల్లో మౌలిక వసతులను మెరుగుపరిచి.. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని జా తీయ బాలల హకుల కమిషన్ రాష్ట్ర ఆరోగ్యశాఖ డైరెక్టర్‌కు నోటీసులు జారీచేసింది. గతనెల ఆదిలాబాద్ జిల్లాలోని గుడిహత్నూర్ ప్రభుత్వ దవాఖానలో రెండురోజుల పసికందుపై సీలింగ్ ఫ్యాన్ ఊడిపడటంతో గాయపడిన సంఘటనపై హైదరాబాద్‌కు చెందిన న్యాయవా ది కారుపోతుల రేవంత్ జాతీయ బాలల హకుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కమిషన్.. శిశువుకు తగిన నష్టపరిహారం అందించడంతోపా టు, ఘటనపై 10 రోజుల్లోపు నివేదిక అందించాలని సూచించింది.