హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ) : జిల్లా విద్యాశాఖాధికారుల (డీఈవో) కాన్ఫరెన్స్ ఈ నెల 30న జరగనున్నది. హైదరాబాద్లో జరగనున్న ఈ సమావేశంలో రోజంతా పలు అంశాలపై సమీక్షించనున్నారు. కొత్త ఎన్రోల్మెంట్, అపార్, ఎఫ్ఆర్ఎస్, సమగ్రశిక్ష, న్యాస్, ఎఫ్ఎల్ఎన్, ఏఎక్స్ఎల్, లిప్, ఎస్సెస్సీ వార్షిక పరీక్షలు, పీఎం పోషణ్, పీఎం శ్రీస్కూళ్లు, టీచర్ల సర్దుబాటు, కొత్త పాఠశాలల ఏర్పాటు, ఆర్టీఈ 12(1)సీ, వన మహోత్సవం, ఓపెన్ స్కూల్, కేజీబీవీలు, యూఆర్ఎస్, భవిత సెంటర్లు, మాడల్ స్కూళ్లు వంటి అంశాలపై చర్చించనున్నట్టు అధికారులు సమాచారం ఇచ్చారు.
విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ సమీక్షిస్తారు.