Operation Musi | ఆశల సౌధాలను కండ్లముందే కూల్చివేస్తుండడంతో బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. చాదర్‌ఘాట్ మూసానగర్, శంకర్‌నగర్ బస్తీలో బుధవారం హృదయవిదారకమైన దృశ్యాలు కనిపించాయి. పిల్లాపాపలతో ఇన్నాళ్లూ జీవించిన ఇండ్లన్నీ మొండి గోడలుగా దర్శనమిచ్చాయి. చివరిసారిగా తమ ఇండ్లను చూసుకుంటూ గత స్మృతులను మననం చేసుకుంటూ కనిపించారు.
ఇండ్లు కోల్పోవడంతో సమీప బంధువులను వీడి ఇతర ప్రాంతాలకు వెళ్తుండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకరినొకరు పలుకరించుకుంటూ బాధను దిగమింగుకొని వెళ్లారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం తమ గూడును చెదరగొట్టిందని ఆవేదన వ్యక్తంచేశారు. తమను ఇంతలా బాధపెడుతున్న సర్కారుకు తగిన బుద్ధి చెబుతామంటూ శాపనార్థాలు పెడుతూ వెళ్తుండడం కనిపించింది.
శంకర్‌నగర్ బస్తీలో కూల్చివేసిన ఇండ్లు
శంకర్‌నగర్ బస్తీలో తమ ఇండ్లను కూల్చివేయడంతో సమీపంలోని మసీదు వద్ద ప్రార్థనలు చేస్తున్న మహిళలు
చాదర్‌ఘాట్ మూసానగర్‌లో కొనసాగుతున్న ఇండ్ల కూల్చివేత
చాదర్‌ఘాట్ మూసానగర్‌లో కూల్చివేతలో భాగంగా కోల్పోయిన ఇంటి వద్ద నిరాశగా బాలుడు
చాదర్‌ఘాట్ శంకర్‌నగర్ బస్తీలో కూల్చివేతల అనంతరం చివరిసారిగా తమ ఇంటి వద్ద కూర్చున్న ఓ కుటుంబం