వెల్దండ, మార్చి 10: పాడి రైతులు కన్నెర్ర చేశారు. మూడు నెలలుగా పెండింగ్లో ఉన్న పాల బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాం డ్ చేశారు. నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం పెద్దాపూర్ గ్రామానికి చెందిన పాడి రైతులు సోమవారం హైదరాబాద్-శ్రీశైలం హైవేపైకి చేరుకొని రాస్తారోకో చేపట్టారు. పలువురు రైతులు మాట్లాడుతూ.. రాత్రింబవళ్లు కష్టపడి, అప్పులు తెచ్చి పశుగ్రాసం కొనుగోలు చేసి, విజయ డెయిరీకి పాలు పోస్తే నెలల తరబడి బిల్లులు చెల్లించకుంటే ఎలా బతకాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే పాడి రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. వెంట నే బిల్లులు విడుదల చేయాలని, లేకుంటే ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. పాల బిల్లులు కూడా తగ్గించి ఇచ్చారంటూ పలువు రు పాడి రైతులు ఆందోళనకు దిగారు. ఊ ర్కొండ మండలం ఊర్కొండపేట, బొమ్మరాజుపల్లి, ఇప్పపహాడ్లో పాలసేకరణ కేంద్రాల వద్ద పాలక్యాన్లతో పాడి రైతులు నిరసన తెలిపారు. మంగళవారం కల్వకుర్తిలో నిర్వహించనున్న పాడిరైతుల ర్యాలీకి ప్రతి గ్రామం నుంచి రైతులు తరలిరావాలని విజ్ఞప్తి చేశారు.