Telangana | మాకిచ్చిన మాట నెరవేర్చండి.. ప్రభుత్వానికి తెలంగాణ ఉద్యమకారుల డిమాండ్
తమను అన్ని విధాలా ఆదుకోవాలని తెలంగాణ ఉద్యమకారులు ప్రభుత్వాన్ని కోరారు. 250 గజాల ఇంటి స్థలంతోపాటు జార్ఖండ్ రాష్ట్రంలో మాదిరిగా ప్రతి నెలా పింఛన్ ఇవ్వాలని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, హెల్త్ కార్డులు, బస్ పాస్‌లు అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
- 250 గజాల చొప్పున ఇంటి స్థలం ఇవ్వాలి
- పింఛన్లు, హెల్త్‌కార్డులు మంజూరు చేయాలి
- జార్ఖండ్ మాదిరిగా పింఛన్ అందించాలి
- ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి
- సర్కార్‌కు తెలంగాణ ఉద్యమకారుల వినతి
- పలు జిల్లాల్లో ప్రత్యేక సమావేశాలు
ఎన్నికల కోడ్ అంటూ పథకాల అమలును ఇప్పటి వరకు దాటవేశారు. ఇప్పటికైనా హామీలు అమలు చేయండి. ఆరు గ్యారెంటీల్లో ఒకటైన ఇంటి స్థలాన్ని ఎఫ్ఐఆర్తో సంబంధం లేకుండా కేటాయించాలి. సంక్షేమ పథకాల్లో ప్రత్యేక కోటా కల్పించాలి.
-డాక్టర్ చీమ శ్రీనివాస్, ఉద్యమకారుల ఫోరం చైర్మన్
Telangana | మహదేవపూర్/ములుగు రూరల్/నెక్కొండ/చెన్నారావుపేట/హనుమకొండ, జూన్ 9 : తమను అన్ని విధాలా ఆదుకోవాలని తెలంగాణ ఉద్యమకారులు ప్రభుత్వాన్ని కోరారు. 250 గజాల ఇంటి స్థలంతోపాటు జార్ఖండ్ రాష్ట్రంలో మాదిరిగా ప్రతి నెలా పింఛన్ ఇవ్వాలని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, హెల్త్ కార్డులు, బస్ పాస్‌లు అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆదివారం భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌లో, ములుగు జిల్లా కేంద్రంలో, వరంగల్ జిల్లా నెక్కొండలో, చెన్నారావుపేటలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర నాయకుడు ఆయూబొద్దీన్ మాట్లాడుతూ.. ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని కోరారు.
ఆయాచోట్ల జరిగిన సమావేశాల్లో ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పోతు జ్యోతిరెడ్డి, మహదేవపూర్ మండల ప్రధాన కార్యదర్శి కలికోట దేవేందర్, అన్కారీ ప్రభాకర్, ములుగు జిల్లా అధ్యక్షుడు మురహరి భిక్షపతి, సంఘం వరంగల్ జిల్లా కార్యదర్శులు అల్లి యాదగిరి, కౌడగాని రాజీరు, ఉపాధ్యక్షులు మల్లాడి వీరారెడ్డి, అల్లి ఉమ, శారద, నెక్కొండ మండల అధ్యక్షుడు కొత్త సంపత్‌రెడ్డి, ఉపాధ్యక్షురాల అనిత, మాజీ సర్పంచ్ మహబూబ్‌పాషా, మాజీ ఉపసర్పంచ్ పరిపాటి ఇంద్రసేనారెడ్డి, చెన్నారావుపేట మండల అధ్యక్షుడు ఉప్పునూతుల లింగమూర్తి, కార్యదర్శి లక్ష్మణ్, కోశాధికారి సింగారపు సునీల్‌కుమార్, ఉద్యమకారులు జలగం మోహన్‌రావు, గరిగె రఘు, బైకాని ఓదెలు, గడ్డమీది భాస్కర్, బత్తుల రాణి, మేడుదల వెంకన్న, దర్శనాల సంజీవ, కడారి తిరుపతి, కొండి రమేశ్, బానోత్ గోపి, చందు, కొండా రమేశ్, బండారి సారయ్య, ముడుసు కొమ్మాలు. మెండె నర్సయ్య, గణేశ్, ముత్తయ్య, పోషాలు నేల మల్లమ్మ (వంటల మల్లమ్మ) రవి, మోహిని, స్వరూప, వంగ రజిత, సెండెల్లి లక్ష్మి, లక్ష్మి, బండి సరోజన తదితరులు పాల్గొన్నారు.
మమ్మల్ని ఆదుకోండి
గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులకు రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం డిమాండ్ చేసింది. నామినేటెడ్ పోస్టుల్లోనూ ప్రాధాన్యత కల్పించాలని కోరింది. ఈ మేరకు హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఫోరం చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీల్లో ఒకటైన నిజమైన ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలాన్ని ఎఫ్ఐఆర్తో సంబంధం లేకుండా వెంటనే కేటాయించాలని కోరారు. పథకాల అమలుకు ఎన్నికల కోడ్ ఉందం టూ దాటవేశారని, ఇప్పటికైనా హామీలు అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. గుర్తింపు కార్డులతోపాటు పింఛన్, ఉచిత బస్‌పాస్, హెల్త్‌కార్డు, వడ్డీలేని రుణాలు ఇవ్వడంతోపాటు సంక్షేమ పథకాల్లో ప్రత్యేక కోటా కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో ఫోరం ప్రధాన కార్యదర్శి పటోళ్ల సుదర్శన్‌రెడ్డి, వీరస్వామి, బీ ఇంద్రకుమార్, గుండేటి ఐలయ్య యాదవ్, గుర్జని వెంకటేశ్‌గౌడ్, ఉండాటి లాలయ్య, దుగ్గని శ్యామల, సదయ్య, ప్రభాకర్, జంగా సుదర్శన్, కే నరేందర్‌గౌడ్, పొంతం యాదిరెడ్డి, కే సురేందర్‌రెడ్డి, దయానంద్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బూర్గంపహాడ్‌లో ఇసుక అక్రమ రవాణాపై టాస్క్‌ఫోర్స్ దాడులు
Kuravi | అమ్మమ్మ ఇంటికొచ్చి అనంతలోకాలకు.. నీటి గుంతలో పడి తొమ్మిదేళ్ల బాలుడి మృతి
Pneumonic Plague | న్యుమోనిక్ ప్లేగు అంటే ఏమిటి.. ప్లేగులో ఎన్ని రకాలు ఉన్నాయి..?
Punjab | డ్రగ్స్ వ్యతిరేక కార్యకర్త హత్య కేసు.. నిందితుడి ఇల్లు కూల్చివేత.. షాపు దహనం
Election Schedule | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. మూడు విడతలుగా ఎన్నికలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

