హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): తమకు వేతనాలు ఇప్పించాలంటూ నిజామాబాద్ జిల్లాకు చెందిన ఏఎన్ఎంలు మంగళవారం సీఎం రేవంత్రెడ్డి నివాసానికి వచ్చారు. కొన్ని నెలలుగా తమకు వేతనాలు అందడం లేదని, జిల్లా మంత్రులు, ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదని వాపోయారు.
గతంలోనూ ఓ సారి సీఎంను కలిసేందుకు వచ్చామని, ఎన్నికల కోడ్ పూర్తయిన తర్వాత పరిశీలిస్తామని చెప్పారని గుర్తుచేశారు. రాష్ట్రమంతటా వేతనాలు అందుతున్నాయని, ఒక్క నిజామాబాద్ జిల్లాకు చెందిన ఏఎన్ఎంలకు మాత్రం రావడం లేదని వాపోయారు. సీఎం సిబ్బంది వారి నుంచి వినతిపత్రం తీసుకొని, పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వెనుదిరిగారు.