ఆసిఫాబాద్ అంబేద్కర్‌చౌక్, డిసెంబర్ 8: బూరుగూడలోని గిరిజన గుకురుల డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్ దివ్యరాణి తమపట్ల వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని, ఆమెను వెంటనే సస్పెండ్ చేయాలని ఆ కళాశాల విద్యార్థులు శుక్రవారం ఆసిఫాబాద్ కలెక్టరేట్ వద్ద ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమను ప్రిన్సిపాల్ మానసికంగా వేధిస్తున్నారని, వెంటనే ఆమెను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కొద్దిసేపటికి డీడీ రమాదేవి, సంబంధిత అధికారులు అకడికి చేరుకొని విద్యార్థులను సముదాయించారు. అయినా విద్యార్థులు వినకపోవడంతో అధికారులు డిగ్రీ కళాశాలల అసిస్టెంట్ సెక్రటరీతో ఫోన్లో మాట్లాడి ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. అనంతరం ప్రన్సిపాల్‌ను సస్పెండ్ చేస్తూ సంబంధిత శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.