సింగరేణివ్యాప్తంగా కార్మికుల ఆందోళన
సింగరేణిలో వెంటనే మెడికల్ బోర్డు నిర్వహించాలని, కార్మికులపై విజిలెన్స్ పేరుతో వేధింపులు మానుకోవాలని, సింగరేణిలోని కుంభకోణాలు, అవినీతి అక్రమాలపై సీబీఐ, సిట్‌తో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సోమవారం టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో సింగరేణివ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు.
- కారుణ్య నియామకాలు వెంటనే చేపట్టాలని డిమాండ్
- కొత్తగూడెంలోని హెడ్డాఫీసు ముట్టడిలో తీవ్ర ఉద్రిక్తత
- సింగరేణి ఏరియాల్లో టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో కార్మికుల ధర్నాలు
నమస్తే తెలంగాణ నెట్వర్క్, మార్చి 30 : సింగరేణిలో వెంటనే మెడికల్ బోర్డు నిర్వహించాలని, కార్మికులపై విజిలెన్స్ పేరుతో వేధింపులు మానుకోవాలని, సింగరేణిలోని కుంభకోణాలు, అవినీతి అక్రమాలపై సీబీఐ, సిట్‌తో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సోమవారం టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో సింగరేణివ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. కాగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కొత్తగూడెంలోని సింగరేణి హెడ్డాఫీసు ముట్టడి కార్యక్ర మం ఉద్రిక్తంగా మారింది. కోల్‌బెల్ట్ ప్రాం తాల నుంచి వచ్చిన వేలాదిమంది కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించి హెడ్డాఫీసు ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులకు, నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. నాయకులను పోలీసులు అరెస్టు చేసి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తొలుత ధర్నా వద్ద కార్మికులను ఉద్దేశించి సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ నారాయణ మాట్లాడుతూ.. సింగరేణి సంస్థకు రూ.50 వేల కోట్ల బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశా రు.
కాగా టీబీజీకేఎస్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఆ సంఘం నాయకులు కొత్తగూ డెం, ఇల్లెందు జీఎం కార్యాలయాల ఎదుట ధర్నా లు నిర్వహించి వినతిపత్రాలు సమర్పించారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం ఎదుట టీబీజీకేఎస్ నాయకులు, కార్మికులు ధర్నా చేశారు. టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నడిపెల్లి విజిత్‌రావు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జీఎంకు వినతిపత్రం అందజేశారు. మెడికల్ ఇన్వ్యాలిడేషన్లో అక్రమాలు జరిగాయని, అందుకే మెడికల్ బోర్డు ఏర్పా టు చేయడం లేదని అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క పేర్కొనడంపై తీవ్రంగా మండిపడ్డారు.పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ -1, 2, 3వ జీఎం కార్యాలయాల ఎదుట ధర్నా చేపట్టారు. భూపాలపల్లిలో సమ్మయ్య ఆధ్వర్యంలో టీబీజీకేఎస్ నాయకులు ఏరియా పర్సనల్ మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

