స్టేషన్‌ఘన్‌పూర్, మే 25: ధాన్యం కొనుగోలులో జాప్యం ఓ రైతును బలిగొన్నది. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం రంగరాయగూడెంలో సోమవారం చోటుచేసుకున్నది. రంగరాయగూడెం గ్రామానికి చెందిన రైతు నెలమంచ ఏలేందర్రెడ్డి (39) తన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి 20 రోజుల క్రితం తీసుకొచ్చాడు. కేంద్రం నిర్వాహకులు టోకెన్లు ఇవ్వగా 81, 82వ సీరియల్ నంబర్లు వచ్చాయి. అప్పటినుంచి రోజూ కొనుగోలు కేంద్రం లో పోసిన ధాన్యం వద్దకు వెళ్లి వస్తున్నాడు. సోమవారం తన ధాన్యానికి కాంటా పెడుతారనే సమాచారంతో కేంద్రానికి వచ్చిన ఆయన ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో కుప్పకూలిపోయాడు.