DOST notification | హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ) : వచ్చేవిద్యాసంవత్సరానికి డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) నోటిఫికేషన్‌ను గురువారం రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి, కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్‌మిట్టల్ విడుదల చేయనున్నారు. ఇంటర్ ఫలితాలు మంగళవారం విడుదలైన విషయం తెలిసిందే. ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించి డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.