ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు వేయాల్సిందే
పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేల అనర్హతపై దాఖలైన పిటిషన్లలో సింగిల్ జడ్జి సరైన ఉత్తర్వులే జారీ చేశారని బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్రెడ్డి తర ఫు సీనియర్ న్యాయవాది జే ప్రభాకర్రావు పేర్కొన్నారు.
- సింగిల్జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు సరైనవే
- హైకోర్టులో కొనసాగిన వాదనలు
హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేల అనర్హతపై దాఖలైన పిటిషన్లలో సింగిల్ జడ్జి సరైన ఉత్తర్వులే జారీ చేశారని బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్రెడ్డి తర ఫు సీనియర్ న్యాయవాది జే ప్రభాకర్రావు పేర్కొన్నారు. సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరడంపై దాఖలైన కేసుల్లో సింగి ల్ జడ్జి గత సెప్టెంబరు 9న ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వీ నరసింహాచార్యులు రెండు అప్పీళ్లను దాఖలు చేశారు.
వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణను కొనసాగించింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ఆఫీసుకు, ఇంటికి పిటిషన్లను రిజిస్టర్ పోస్టులో పంపితే తీసుకోలేదని తెలిపారు. అందుకే హైకోర్టుకు రావాల్సి వచ్చిందన్నారు. కోర్టులో సవాలు చే యడాన్ని ప్రశ్నిస్తున్నారు కానీ, తాము ఇచ్చిన అనర్హత పిటిషన్లపై ఏం నిర్ణయం తీసుకున్నారె ఎలాంటి స్పష్టతనివ్వడం లేదని చెప్పారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూలు ప్రకారం స్పీకర్ విధులు నిర్వహించాల్సిందేనని పేర్కొన్నారు. అనర్హత పిటిషన్లపై తేల్చాల్సింది స్పీకరేనని, ఈ విషయంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు చట్టపరిధిలోనే ఉన్నట్లు స్పష్టం అవుతుందని తెలిపారు.
మధ్యంత ఉత్తర్వుల జారీకి నిరాకరణ
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాల్లో, సభ ఓటింగ్లో గానీ పాల్గొనకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాల ని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ చేసిన విజ్ఞప్తిని హైకోర్టు తోసిపుచ్చింది. అనర్హత పిటిషన్లపై తేల్చకుండా ఇలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తెలిపింది. రాజకీయాలకు కోర్టులను వేదికగా మార్చవద్దని హితవు చె ప్పింది. కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ విచారణ వాయిదా వేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

