నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలో ఎస్సారెస్పీ బ్యాక్‌వాటర్ వద్ద జింకలు సందడి చేస్తున్నాయి. గుంపులు గుంపులుగా వస్తున్న జింకల సమూహం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నది. నీళ్లు, గడ్డి పుష్కలంగా ఉండటంతో ఈ ప్రాంతంలో చెంగుచెంగున దుంకుతున్నాయి. నిజామాబాద్‌కు చెందిన ఔత్సాహిక ఫొటోగ్రాఫర్ క్యాతం సంతోష్‌కుమార్ ఈ చిత్రాలను తన కెమెరాలో బంధించారు.
