మునుగోడు, ఏప్రిల్ 16 : నెల రోజులుగా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి కాంటాల కోసం ఎదురు చూస్తున్న రైతులను తాలు, తేమ పేరుతో అధికారులు ఇబ్బందులకు గురి చేయడం సరికాదని డిమాండ్ చేశారు. గురువారం మునుగోడు మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకో చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ నల్లగొండ జిల్లా కార్యవర్గ సభ్యుడు గురజా రామచంద్రం మాట్లాడుతూ.. నెలల తరబడి ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందికి గురి చేస్తున్న అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యాన్ని ఎలాంటి కొర్రెలు పెట్టకుండా ప్రభుత్వ మద్దతు ధర కొనుగోలు చేయాలన్నారు.
ఆరుగాలం శ్రమించి మార్కెట్కు తీసుకొస్తే పలు ఇబ్బందులు పెట్టడం సరికాదన్నారు. మిల్లర్లు అధికారులు కుమ్మక్కై రైతుల ధాన్యాన్ని హాజరైన తాలు, తేమ పేరుతో కొనుగోలుకు నిరాకరించడం సరికాదన్నారు. ధాన్యం కొనుగోలును వెంటనే ప్రారంభించి రైతులకు న్యాయం చేయాలని లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని ఈ సందర్భంగా తెలిపారు. రాస్తారోకో సందర్భంగా స్థానిక పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు విషయం తెలుసుకున్న స్థానిక తాసీల్దార్ రైతులకు న్యాయం చేస్తామని, కొనుగోలు వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. సిపిఐ రైతు సంఘం నాయకులు బిస్మించి కూర్చొవడంతో పోలీసులు వారిని బలవంతంగా తరలించారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బొలుగూరి నరసింహ, తీర్పారి వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి చాపల శ్రీనివాస్, జిల్లా కౌన్సిల్ సభ్యులు సురిగి చలపతి, మాజీ జెడ్పిటిసి గోస్కొండ లింగయ్య, మండల కార్యవర్గ సభ్యులు బండమీది యాదయ్య, మందుల పాండు, ఈదులకంటి కైలాస్, కాగితం వెంకన్న, దుబ్బ వెంకన్న, కురుమర్తి ముత్తయ్య, తీర్పార కృష్ణయ్య, కట్కూరి లింగస్వామి, చిరగోని శంకర్, నరసింహ పాల్గొన్నారు.