హైదరాబాద్ : రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌పై ఉత్తరాఖండ్ జర్నలిస్ట్ రమేశ్ భట్ ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కేటీఆర్ కీలకపాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే యువత కేటీఆర్‌ను చూసి చాలా నేర్చుకోవాలని రమేశ్ భట్ సూచించారు.
తెలంగాణ ప్రగతితో పాటు కేటీఆర్ చేస్తున్న మంచి పనులను రమేశ్ భట్ తన ట్విట్టర్ ఖాతా వేదికగా ప్రశంసించారు. ప్రపంచ స్థాయి పెట్టుబడులను తెలంగాణకు తీసుకొచ్చేందుకు మంత్రి కేటీఆర్ విశేషంగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఆ రాష్ట్రంలో ఉన్న వనరులను, వసతులతో పాటు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సహకాలను పెట్టుబడిదారులకు వివరిస్తూ, ప్రపంచ స్థాయి పెట్టుబడులను కేటీఆర్ ఆకర్షిస్తున్నారని తెలిపారు. అలా తెలంగాణ రాష్ట్రాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్నారని కేటీఆర్‌పై ప్రశంసల జల్లు కురిపించారు.
తెలంగాణను అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలన్న నిబద్ధత, చిత్తశుద్ధి కేటీఆర్‌లో తప్ప మరెవరిలోనూ కనిపించదని కొనియాడారు. ఉత్తరాఖండ్‌ను కూడా దేశ, ప్రపంచ స్థాయిలో చూడాలనుకునే వారు.. కేటీఆర్‌ను చూసి చాలా నేర్చుకోవాలన్నారు. రాజకీయాల్లోకి వచ్చే యువత కేటీఆర్‌ను చూసి ప్రేరణ పొందాలని రమేశ్ భట్ సూచించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ రమేశ్ భట్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై స్పందించిన కేటీఆర్.. రమేశ్ భట్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
🙏 Many thanks Sir https://t.co/URBZY7ijdf
— KTR (@KTRTRS) April 8, 2022