DEECET 2023 | హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా డైట్ కాలేజీల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించిన డీఈఈ సెట్ -2023 ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. తెలుగు, ఇంగ్లీష్, ఉర్డూ మీడియం కాలేజీల వారీగా ఫలితాలను వెల్లడించారు.
తెలుగు మీడియంలో 75.91 శాతం, ఇంగ్లీష్ మీడియంలో 84.72 శాతం, ఉర్దూ మీడియంలో 50.65 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 14వ తేదీ నుంచి ర్యాంకు కార్డులు deecet.cdse.telangana.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. డైట్ కాలేజీల్లో ప్రవేశాల నిమిత్తం జూన్ 1వ తేదీన ఆన్లైన్లో రాతపరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.