హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ) : ఈ నెల 22 నుంచి డీఈడీ రెండో సంవత్సరం థియరీ పరీక్షలు నిర్వహించనున్నట్టు రాష్ట్ర పరీక్షల నిర్వహణ డైరెక్టర్ పీవీ శ్రీహరి తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.
27 వరకు జరిగే పరీక్షలను ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. హాల్టికెట్లను www.bse. telangana.gov.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.