Srinivas Goud | ఉమ్మడి పాలమూరు జిల్లా మొత్తం కరువు జిల్లాగా ప్రకటించాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
Srinivas Goud |ఉమ్మడి పాలమూరు జిల్లా మొత్తాన్ని కరువు జిల్లాగా ప్రకటించాలని, లేనిపక్షంలో సెక్రటేరియట్‌ను ముట్టడిస్తామని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
నాగర్ కర్నూల్ : ఉమ్మడి పాలమూరు జిల్లా మొత్తాన్ని కరువు జిల్లా ( Drought District ) గా ప్రకటించాలని, లేనిపక్షంలో సెక్రటేరియట్‌ను ముట్టడిస్తామని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ( Srinivas Goud ) రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి నివాస గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కరువు మండలాలలో ఉమ్మడి జిల్లాలో 15 మండలాలను ప్రకటించకపోవడం దారుణమని మండిపడ్డారు.
15 మండలాలలో రైతులు ప్రజలు సాగునీరు, తాగునీరు అందించాలని ఉద్యమాలు చేస్తున్న ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కరువును ప్రకటించ డం కాదని అధికారులతో సమీక్షలు జరిపి రైతులకు పంట నష్టపరిహారం అందించడంతో పాటు ప్రజలకు నిత్యవసర వస్తువులను కరువు సాయాన్ని అందించాలని డిమాండ్ చేశారు.
తమ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కరువును ఎదుర్కొనేం దుకు సమీక్షలు జరిపి రైతులకు పరిహారం అందించడంతోపాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించడం వల్ల ప్రజల ఇబ్బందులను తీర్చడం జరిగిందని గుర్తు చేశారు. అచ్చంపేట నియోజకవర్గంలోని ఎత్తైన ప్రాంతంలో చెంచు పెంటలు త్రాగునీరు అందక ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
తెలంగాణ సాగునీటిపారుదల శాఖలో అడ్వయిజరీగా ఆంధ్ర ప్రాంతం అధికారి ఉండటం వల్ల ప్రాజెక్టులు పూర్తి కావడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకం పనులను ముమ్మరం చేయాలని విద్యుత్ సమస్యలు పరిష్కరించడంతోపాటు సాగు తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. పట్టాభద్రులైన ప్రతి ఓటరు తమ వివరాలను ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటయ్య, మాజీ జడ్పీటీసీ శ్రీశైలం, కౌన్సిలర్లు గంగాధర్, జేపీ చారి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బాబురావు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు షఫీ ఉల్లా ఖాన్, కేశవులు గౌడ్, శంకర్ గౌడ్, కురుమయ్య, కిషోర్ గౌడ్, టింకు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి’
Srinivas Goud | ఉమ్మడి పాలమూరు జిల్లా మొత్తం కరువు జిల్లాగా ప్రకటించాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
‘చట్టాలపై అవగాహన పెంచుకోవాలి’
Watch: కర్వా చౌత్ రోజున ప్రియుడిని కలిసిన భార్య.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త
Congress Party | కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలతో సతమతమయ్యాం..కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లోకి : ఐనేని దీపక్ రావు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

