హైదరాబాద్ : ఆర్టీసీ ఎన్నికల కంటే ముందుగానే జూన్ 2న విలీనం అపాయింటెడ్ డేట్ ( Appointed Date) ను ప్రభుత్వం ప్రకటించాలని టీజీఎస్ ఆర్టీసీ జేఏసీ ( RTC JAC ) నాయకులు డిమాండ్ చేశారు. గురువారం ముఖ్యమంత్రి రాజకీయ ప్రధాన సలహాదారులు, ఎంపీ వేం నరేందర్ రెడ్డి కి, ఎంపీ రఘురామ్రెడ్డిని జేఏసీ నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ థామస్ రెడ్డి మాట్లాడుతూ రవాణా శాఖ మంత్రి ఇటీవల ఆర్టీసీలో గుర్తింపు ఎన్నికలు జరిగిన తరువాతనే విలీనం ప్రక్రియను ప్రారంభిస్తామని వెల్లడించడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలను చెల్లించడానికి ప్రభుత్వం తగిన నిధులను విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ ఎండీ మౌలానా, కో కన్వీనర్ కత్తుల యాదయ్య, కో కన్వీనర్లు సుద్దాల సురేష్, యాదగిరి, బాబు, బుద్ద విశాల్, రవికిరణ్ పాల్గొన్నారు.