ఖైరతాబాద్, జూన్ 24: ప్రభుత్వం చేపట్టనున్న ‘గిరిజన స్వర్ణోత్సవాల బస్సుయాత్ర’కు ముందు గిరిజనుల హామీలపై సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని గిరిజన సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ రాథోడ్ డి మాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ తాము అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పిన త ర్వాతే బస్సుయాత్ర చేయాలని, లేకపోతే అ డుగడుగునా అడ్డుకుంటామని హెచ్చరించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గిరిజనులకు రిజర్వేషన్లు కల్పించి 50 ఏండ్లు పూర్తయినందున స్వర్ణోత్సవాలు నిర్వహిస్తున్నామని గొప్పలు చెప్తున్న ప్రభుత్వం.. గిరిజనులకు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చడం లేదని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల పెంపు, అటవీ హక్కుల చట్టం, పెసా చట్టం, ఐటీడీఏలు, ట్రైకార్, గురుకులాల ఏర్పాటు, విదేశీ విద్య, విద్యాజ్యోతి పథకాలను అమలు చేయడాన్ని మరిచారని మండిపడ్డారు. డీటీవో వెంకన్ననాయక్ మృతిపై స్పందించకపోవడం బాధాకరమని వాపోయారు.