నల్లగొండ: మైనర్ బాలికపై హత్యాచారం కేసులో నల్లగొండ (Nalgonda) కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితుడికి ఉరిశిక్ష విధించడంతోపాటు రూ.లక్ష జరిమానా విధించింది. 2013లో నల్లగొండకు చెందిన 12 ఏండ్ల బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని గమనించిన మోహమ్మీ ముకర్రం.. ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను హత్య చేసి మృతదేహాన్ని కాలువలో పడేశాడు.
ఈ ఘటనపై పోక్సో చట్టం, హత్యా నేరం కింద కేసు నమోదు చేసిన వన్‌టౌన్ పోలీసులు.. నిందితుడు ముకర్రంను అరెస్టు చేశారు. గత పదేండ్లుగా జిల్లా కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పోక్సో కోర్టు ఇన్చార్జి న్యాయమూర్తి రోజా రమణి నిందితుడికి ఉరిశిఖ విధిస్తూ గురువారం తుదితీర్పు వెలువరించారు. ఉరితోపాటు రూ.1.10 లక్షల జరిమానా విధించారు.