అత్తామామల హత్య కేసులో నిందితుడికి మరణశిక్ష
ప్రేమించి పెండ్లి చేసుకున్న భార్యను తనకు కాకుండా చేస్తున్నారనే కక్షతో అత్తామామలను హత్యచేసిన నిందితుడికి మరణశిక్ష విధి స్తూ వరంగల్ జిల్లా మొదటి అదనపు జిల్లా జడ్జి మైత్రేయి బుధవారం తీర్పు వెలువరించారు.
వరంగల్ లీగల్, మే 20: ప్రేమించి పెండ్లి చేసుకున్న భార్యను తనకు కాకుండా చేస్తున్నారనే కక్షతో అత్తామామలను హత్యచేసిన నిందితుడికి మరణశిక్ష విధి స్తూ వరంగల్ జిల్లా మొదటి అదనపు జిల్లా జడ్జి మైత్రేయి బుధవారం తీర్పు వెలువరించారు. కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పదహారుచింతల తండాకు చెందిన బానోత్ వీరమ్మ కొడుకు బానోత్ శ్రీను- సుగుణ దంపతుల కుమార్తె దీపిక హనుమకొండలోని పింగళి కళాశాలలో చదువుకునే క్రమంలో గుండెంగ గ్రామానికి చెందిన మేకల నాగరాజు అలియాస్ బన్ని ప్రేమ పేరుతో దీపికకు దగ్గరయ్యా డు. ఆటో నడుపుకునే నాగరాజు మాట లు నమ్మిన దీపిక ఎవరికీ తెలియకుండా ప్రేమవివాహం చేసుకున్నది. కొద్దిరోజుల అనంతరం నాగరాజు ప్రవర్తన నచ్చకపోవడంతో దీపిక తల్లిదండ్రుల వద్దకు వెళ్లి అకడే స్థిరపడిపోయింది. అప్పటినుంచి దీపిక, ఆమె తల్లిదండ్రులు, కుటుంబ స భ్యులపై కక్ష పెంచుకున్న నాగరాజు ఎప్పటికైనా వారిని చంపేస్తానని బెదిరించేవాడు.
10 జూలై 2024 రోజు అర్ధరాత్రి బైక్‌పై పదహారు చింతలతండాకు వచ్చిన నాగరాజు ఇంటి ముందు నిద్రిస్తున్న దీపిక, ఆమె తండ్రి శ్రీను, తల్లి సుగుణ, సోదరుడు మదన్‌పై కత్తితో విచక్షణారహితంగా దాడిచేశాడు. ఈ ఘటనలో దీపిక తల్లి సుగుణ అకడికకడే మృతి చెందిం ది. దీపిక తండ్రి శ్రీను దవాఖానకు తరలిస్తుండగా మృతి చెందాడు. గాయపడిన దీపిక, మదన్‌ను తండావాసులు దవాఖానకు తరలించి చికిత్స అందించడంతో బతికిబయటపడ్డారు. నాగరాజు బంధువుల ఇండ్లలో తలదాచుకోగా అప్పటి సీఐ చంద్రమోహన్ నిందితుడిని అరెస్టు చేశాడు. అనంతరం బాధ్యతలు చేపట్టిన నెకొండ సీఐ శ్రీనివాస్ నిందితుడికి వ్య తిరేకంగా చార్జిషీటు దాఖలుచేశారు. బా ధితుల పక్షాన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బృందాదేవి వాదనలు వినిపించారు. సాక్ష్యాధారాలు, వాదనలు పరిశీలించిన న్యాయమూర్తి జే మైత్రేయి మేకల నాగరాజుకు జీవించే హకు లేదని, నిందితుడు మరణించే వరకూ ఉరివేసి శిక్ష అ మలు చేయాలని తీర్పు వెలువరించారు. లైజన్ ఆఫీసర్ కంతేటి హరికృష్ణ పర్యవేక్షణలో కోర్టు డ్యూటీ ఆఫీసర్ సురేందర్ సాక్షులను, ఆధారాలను కోర్టు ముందు ప్రవేశపెట్టారు.
ఇంకా చదవల్సిన వార్తలు
భర్తపై వేటకొడవలితో దాడి ; ఖమ్మం జిల్లా గోరీలపాడు తండాలో ఘటన
కూసుమంచి, మే 20: కుటుంబ తగాదాల నేపథ్యంలో వేట కొడవలితో భర్త ను భార్య నరికిన ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం గోరీలపాడుతండాలో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకున్నది. స్థానికుల కథనం ప్రకా రం.. గోరీలపాడుతండాకు చెందిన వీర న్న, రుక్కమ్మ దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నవి. మంగళవారం రాత్రి కూడా ఘర్షణ జరిగిన క్రమంలో విసిగిపోయిన రుక్కమ్మ భర్తపై వేటకొడవలితో విచక్షణారహితంగా దాడిచేసి పారిపోయింది. తీవ్రగాయాలతో రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న వీరన్న అరుపులు విన్న చుట్టుపక్కలవారు బుధవారం ఉదయం వెళ్లి చూడగా అచేతనంగా పడి ఉన్నాడు. వెంటనే 108 వా హన సిబ్బందికి సమాచారం అందించి ఖమ్మం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కొడుకు వాసునాయక్ ఫిర్యాదు చేయగా కూసుమంచి ఎస్సై నాగరాజు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

