Telangana | హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సర్కారు వైద్యాన్ని పాలకులు గాలికొదిలేశారు. ప్రభుత్వ దవాఖానల్లో మందుల సరఫరాలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఫలితంగా సరైన మందులు దొరక్క, ప్రైవేటుగా కొనలేక రోగులు సతమతం అవుతున్నారు. ఔషధాల పంపిణీదారులకు ప్రభుత్వం పెండింగ్ బిల్లులు మంజూరు చేయకపోవడంతో వారు సరఫరాను నిలిపివేశారు. దీంతో దవాఖానలకు వచ్చేవారికి డాక్టర్ రాసిచ్చిన మందుల్లో సగం బయట కొనుక్కోవాల్సిన దుస్థితి నెలకొన్నది. గాంధీ, ఉస్మానియా వంటి ప్రధాన దవాఖానల్లోనూ ఇదే పరిస్థితి. ప్రాణాధార మందులకు సైతం ఇబ్బందిగా ఉన్నదని వైద్యవర్గాలు చెప్తున్నాయి. కొన్నిరకాల అత్యవసర ఔషధాలను ఆయా దవాఖానలు సొంతంగా కొనుగోలు చేయాల్సి వస్తున్నదని వాపోతున్నాయి. ప్రభుత్వం తమకు రూ.600 కోట్ల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉన్నదని ఔషధ పంపిణీ ఏజెన్సీలు, డీలర్లు చెప్తున్నారు. వీటిని విడుదల చేయాలని కొన్ని నెలలుగా కోరుతున్నా ఫలితం లేదని వాపోతున్నారు. దీంతో మందుల సరఫరాను నిలిపివేసినట్టు చెప్తున్నారు.
ఈఎస్ఐ దవాఖానలు, డిస్పెన్సరీలకు మందులు సరఫరా చేసిన డీలర్లకు కేంద్ర ప్రభుత్వం రూ.180 కోట్లు విడుదల చేసిందని ఔషధ పంపిణీ ఏజెన్సీ ప్రతినిధులు, డీలర్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందులో రూ.35 కోట్లు మాత్రమే విడుదల చేసిందని, మిగతా రూ.145 కోట్లను ఎందుకు విడుదల చేయడం లేదో తెలియడం లేదని పేర్కొన్నారు. కనీసం ఆ నిధులైనా విడుదల చేయాలని వారు కోరుతున్నారు. వాస్తవానికి మందుల సరఫరా కొన్ని నెలల కిందటే ఆగిపోయిందని, బఫర్ స్టాక్‌తో ఇన్ని రోజులుగా నెట్టుకొచ్చామని వైద్యవర్గాలు తెలిపాయి. సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న ఈ సమయంలో మందుల నిల్వలు పెంచాల్సిందిపోయి, తగ్గించడం ఏమిటని ప్రభుత్వంపై రోగులు