నీలగిరి, జూన్ 3: నాలుగు వార్డులు, 1,500కిపైగా ఇండ్లకు తాగునీటిని సరఫరా చేసే వాటర్‌ట్యాంక్‌లో కుళ్లిన స్థితిలో ఉన్న ఓ వ్యక్తి మృతదేహం బయటపడడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. పది రోజుల క్రితమే ఆ వ్యక్తి చనిపోయినట్టు పోలీసులు అనుమానిస్తుండగా, అప్పటి నుంచి ఆ నీళ్లనే తాగుతున్న జనం ఏమవుతుందోనని హడలిపోతున్నారు.
నల్లగొండ జిల్లా కేంద్రంలో సో మవారం ఉదయం వెలుగుచూసిన ఈ ఘటన కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం స్థానిక హనుమాన్‌నగర్‌కు చెందిన ఆవుల వంశీకృష్ణయాదవ్ (27) కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. మానసిక స్థితి సరిగా లేని వంశీకృష్ణ గత నెల 24 నుంచి కనిపించడం లేదంటూ స్థానిక వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో కుటుంబ సభ్యులు ఫిర్యాదుచేశారు.
మరోవైపు పాతబస్తీ హిందూపూర్ వాటర్ ట్యాంక్ నుంచి వచ్చే నీళ్లు దుర్వాసన వస్తుండడంతో 11వ వార్డు ప్రజలు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదుచేశారు. సోమవారం మున్సిపల్ సిబ్బంది తో కలిసి ట్యాంకును పరిశీలించగా అందులో ఓ వ్యక్తి మృతదేహం కనిపించింది. మృతుడిని కనిపించకుండా పోయిన వంశీకృష్ణగా గుర్తించారు.
ఆ ట్యాంక్ నుంచి పట్టణంలోని 11, 12, 27, 28 వార్డులకు తాగునీరు సరఫరా అవుతున్నది. రోజూ అదే నీటి ని తాగుతున్న ప్రజలు ఇప్పు డు ఏం జరుగుతుందోనన్న భ యంతో వణికిపోతున్నారు. మున్సిపల్ సిబ్బంది రోజుల త రబడి వాటర్‌ట్యాంక్‌లను తని ఖీ చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఆగ్రహం వ్య క్తం చేస్తున్నారు.
కోతుల ఘటన మరువకముందే
వంశీకృష్ణ కనిపించకుండా పోయిన రోజునే ట్యాంకులో పడి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్య క్తం చేస్తుండగా, మున్సిపల్ సిబ్బంది మాత్రం తాము మే 30నే ట్యాంక్‌ను శుభ్రం చేసినట్టు చెప్తున్నారు. ప్రతిరోజు వాటర్ లెవల్స్ చూసిన తర్వాతే నీటిని విడుదల చేస్తామని, తమకు మృతదేహం కనిపించలేదని పేర్కొన్నారు. మృతదేహాన్ని సోమవారమే గుర్తించినట్టు తెలిపారు. ఇటీవల నందికొండ మున్సిపాలిటీలో వాటర్‌ట్యాంక్‌లో 30కిపైగా కోతులు మృతిచెందిన ఘటన మరువక ముందే నల్లగొండలో ఈ ఘటన చేసుకోవడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మే 30నశుభ్రం చేశాం
హిందూపూర్ వాటర్‌ట్యాంక్‌లో ము న్సిపల్ ఏఈ, వాటర్ లైన్‌మన్ మృతదేహాన్ని సోమవారం గుర్తించారు. వెంటనే నీటిని తొలగించి శవాన్ని బయటకు తీ శాం. ట్యాంకును చివరిగా మే 30న తని ఖీ చేసి జూన్ ఒకటిన నీటిని విడుదల చే శాం. ఆ రోజు శవం కనిపించ లేదు. మృ తదేహాన్ని చూస్తే చనిపోయి రెండు మూడ్రోజులైనట్లు ప్రాథమిక విచారణలో తేలిం ది. ట్యాంకు నుంచి నీటిని సరఫరా చేసిన 50 ఇండ్లను వైద్యారోగ్యశాఖ అధికారుల ఆధ్వర్యంలో సందర్శించాం. అందరూ ఆరోగ్యంగానే ఉన్నారు.
– సయ్యద్ ముసాబ్ అహ్మద్, మున్సిపల్ కమిషనర్
ముమ్మాటికీ ప్రభుత్వ నిర్లక్ష్యమే
హిందూపూర్ వాటర్‌ట్యాంక్‌లో మృతదేహం ఉన్నా ట్యాంక్‌ను చెక్ చేయకుండా నీటిని సరఫరా చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ నిర్లక్ష్యమే. ఆ నీటిని తాగిన ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వేసవికాలంలో తాగునీటి సరఫరాపై ఎప్పటికప్పుడు సమీక్షించాల్సిన స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోకపోవడంతో అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆ ట్యాంకు నీటిని తాగిన ప్రజలందరికీ వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించాలి. ఘటనకు బాధ్యులైన అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి.
-కంచర్ల భూపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే