Dead Body | ఏలూరు, డిసెంబర్ 20 : ఏపీలో ఇల్లు నిర్మించుకుంటున్న నాగ తులసికి దిగ్భ్రాంతికర అనుభవం ఎదురైంది. ఓ దాత నుంచి పార్శిల్లో కుళ్లిన శవంతోపాటు రూ.1.3 కోట్లు డిమాండ్ చేస్తూ ఓ లేఖ రావడంతో ఆమె షాక్కు గురైంది. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ప్రభుత్వం కేటాయించిన స్థలంలో ఇల్లు నిర్మించుకుంటున్న తులసి ఆర్థిక సాయం కోసం క్షత్రియ సేవా సమితిని ఆశ్రయించింది.
దీంతో ఆ సమితి గతంలో ఆమె ఇంటికి అవసరమైన టైల్స్ పంపింది. అనంతరం రెండో విడత సాయం కింద విద్యుత్తు ఉపకరణాలను అందించాలని కోరడంతో.. లైట్లు, ఫ్యాన్లు, స్విచ్లు లాంటి వస్తువులను అందజేయనున్నట్టు మెసేజ్ వచ్చింది. అయితే, పార్శిల్లో కుళ్లిన శవం రాగా, డెలివరీ బాయ్ మాత్రం అందులో ఎలక్ట్రికల్ వస్తువులే ఉన్నాయనడం కొసమెరుపు.