Black Money | ఆదిబట్ల, జూన్ 16 : ఓ చాక్లెట్ కంపెనీ ఓనర్ ఇంట్లో ఓ చాక్లెట్ కంపెనీ ఓనర్ ఇంట్లో భారీగా నల్లధనం ఉన్నదని, ఫేక్మనీని పెట్టి దాన్ని కొట్టేయాలని దోపిడీ దొంగలు వేసిన భారీ స్కెచ్‌ను ఆదిబట్ల పోలీసులు భగ్నం చేశారు. భారీగా నల్లధనం ఉన్నదని, ఫేక్మనీని పెట్టి దాన్ని కొట్టేయాలని దోపిడీ దొంగలు వేసిన భారీ స్కెచ్‌ను ఆదిబట్ల పోలీసులు భగ్నం చేశారు. 15 మంది నిందితుల ను అరెస్టు చేయగా ఒకరు పరారీలో ఉన్నారు. ఈ ఘటన వివరాలను ఆదివారం మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి ఆదిబట్ల ఠాణాలో నిర్వహించిన సమావేశంలో వెల్లడించారు. తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిధి బ్రాహ్మణపల్లికి చెందిన బోగిని జంగయ్య, రియల్ ఎస్టేట్ వ్యాపారి. అతడికి శేఖర్‌రెడ్డి, మహమూద్ పరిచయమయ్యారు. దొడ్డిదారిలో డబ్బుకొట్టేయాలని వీరు రోజూ ఆలోచిస్తూ ఉండేవారు. ఇదే మున్సిపాలిటీ పరిధి శ్రీరాంనగర్‌కాలనీకి చెందిన చాక్లెట్ కంపెనీ ఓనర్ తిరుమన తురై ఇంట్లో రూ.950కోట్ల నల్లధ నం ఉన్నదని అతడి వాచ్‌మన్ ద్వారా బోగిని జంగయ్య, శేఖర్‌రెడ్డి, మహమూద్తో పాటు పెద్ది శ్రీనివాస్‌కు తెలిసింది. వీళ్లు విజయవాడకు చెందిన రజాక్‌ను సంప్రదించారు. అత డు సతీశ్ అనే వ్యక్తికి ఫోన్‌చేసి చాక్లెట్ కంపెనీ ఓనర్ ఇంట్లో డబ్బు కొట్టేసేందుకు మనుషు లు కావాలని లొకేషన్ పంపాడు. గతంలో ప లు చోరీల్లో సహకరించిన జాఖీలఖానీ, మరికొందరు కలిసి భారీ స్కెచ్ వేశారు.
ఫేక్మనీ, తయారీ పౌడర్, లిక్విడ్ అందుబాటులో ఉం చుకొని డబ్బు కొట్టేసిన తర్వాత దాని స్థానం లో వీటిని ఉంచాలని ప్లాన్ వేశారు. చాక్లెట్ కంపెనీ ఓనరే ఫేక్కరెన్సీని తయారు చేస్తున్న ట్టు నమ్మించాలని ప్రణాళికలు వేసుకున్నారు. గత నెల 4న రాత్రి చోరీకి యత్నించి ఇంట్లో అలికిడి కావడంతో వెనుతిరిగారు. ఈ నెల 10న రాత్రి 1.30 గంటలకు 15 మంది చోరీ కోసం మళ్లీ వెళ్లారు. వాచ్‌మన్‌ను తాళ్లతో కట్టే సి, సీసీ కెమెరాల వైర్లను కట్‌చేశారు. తలుపు లు పగులగొట్టేందుకు యత్నించగా అప్రమత్తమైన యజమాని 100కు కాల్ చేశాడు. పెట్రోలింగ్ వాహనం రావడాన్ని గమనించిన నిం దితులు, వాచ్‌మన్ వద్ద ఉన్న కొంత నగదు, సెల్‌ఫోన్ ఎత్తుకెళ్లారు. చాక్లెట్ కంపెనీ ఓనర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సతీశ్, జాఖీలఖా నీ, మహ్మద్ ఆదిల్, షావూద్ హష్మీ, సయ్యిద్ ఇస్మాయిల్, రహీముల్లాఖాన్, అక్బర్‌ఖాన్, ఎండీ జాఫర్, షమీముల్లా, మహ్మద్ ముదాషీర్, ఎండీ మ హమూద్, బోగిని జంగయ్య, శేఖర్‌రెడ్డి, పెద్ది శ్రీనివాస్‌ను అరెస్ట్ చేశారు. రజాక్ పరారీలో ఉన్నాడు. నిందితుల నుంచి మూడు కార్లు, బైక్, 16 సెల్ఫోన్లు, మారణాయుధాలు, ఇ నుపరాడ్డు, ఫేక్మనీ బండిల్, పౌడర్, రూ. 80వేలు స్వాధీనం చేసుకున్నారు.