Speaker Pocharam | స్పీకర్ పోచారంను విమర్శిస్తే పుట్టగతులు లేకుండా చేస్తాం
Speaker Pocharam | రైతులకు 3 గంటలు కరంటు ఇవ్వాలన్న రేవంత్ రెడ్డిపై ఓ రైతుగా అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి విమర్శించారని, కనీస అవగాహన లేని రేవంత్, స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన బాన్సువాడ లో స్పీకర్ పై రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.
కామారెడ్డి : రైతులకు 3 గంటలు కరంటు ఇవ్వాలన్న రేవంత్ రెడ్డిపై ఓ రైతుగా అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి విమర్శించారని, కనీస అవగాహన లేని రేవంత్, స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన
బాన్సువాడ లో స్పీకర్ పై రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం బీఆరెస్ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పోచారం భాస్కర్ రెడ్డి మాట్లాడారు.
రాజ్యాంగ బద్ధ పదవుల్లో ఉన్న పోచారం, గుత్తా సుఖేందర్ రెడ్డిలను బర్తరఫ్ చేయాలని అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంపీ రేవంత్ రెడ్డిని ఆ పదవికి అనర్హుడిని చెయాలని త్వరలో లోకసభ స్పీకర్ కు బాన్సువాడ నియోజకవర్గం నుంచి లేఖలు రాస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ రైతు వ్యతిరేక పార్టీ అని, రానున్న ఎన్నికల్లో ఆ పార్టీకి రైతులే బుద్ది చెబుతారని అన్నారు.
రేవంత్ రెడ్డి గతంలో బ్రోతల్ కంపెనీ నడిపించాడని, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో వేల కోట్ల విలువ చేసే భూములను కబ్జా చేశాడని, రూ.50 కోట్లు ఇచ్చి పీసీసీ పదవిని పొందాడని పోచారం భాస్కర్ రెడ్డి విమర్శించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో జైలుకు పోయిన బ్రోకర్ , బట్టేబాజ్ రేవంత్ రెడ్డి అని, అలాంటి వ్యక్తి కి 120 ఏళ్ళ చరిత్ర గల కాంగ్రెస్ లో పీసీసీ పదవి ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికే చెల్లిందన్నారు.
వ్యవసాయం, రైతుల గురించి రేవంత్ రెడ్డికి ఏమాత్రం అవగాహన లేదన్నారు. ఎల్లప్పుడూ రైతుల గురించే ఆలోచించే ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిలను విమర్శిస్తే బొంద పెడతామని, బాన్సువాడ నియోజకవర్గంలో అడుగు పెట్టనియమని హెచ్చరించారు. మీడియా సమావేశంలో జిల్లా రైతుబంధుఅధ్యక్షుడు డి అంజిరెడ్డి, బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, సొసైటీ చర్మైన్ కృష్ణా రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ మోహన్ నాయక్, ఎజాజ్, పాత బాలకృష్ణ, దొడ్ల వెంకట్రామిరెడ్డి, గురువినాయ్ కుమార్, వహాబ్, తదితరులు పాల్గొన్నారు.
Speaker Pocharam Bhaskar Reddy, Revanth Reddy,Congress,Kamareddy
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘దొరికింది దొరికినట్లే దోచుకుంటున్నారు’
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

