హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. దీంతో చలి తీవ్రత కొంతమేరకు తగ్గింది. రాత్రి వేళల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు కూడా స్వల్పంగా పెరిగాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్లో 9.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా జిల్లాల్లో డబుల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే మూడు రోజులు కొన్ని జిల్లాల్లో ఉదయం సమయంలో పొగమంచు తీవ్రత ఉండనున్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాబోయే వారం రోజుల పాటు పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.