హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ) : ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన బీఆర్ఎస్ నేత డాక్టర్ దాసోజు శ్రవణ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు అసెంబ్లీ ప్రాంగణంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆయనతో ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, పద్మారావుగౌడ్ తదితరులు హాజరుకానున్నారు.