హైదరాబాద్, జులై 8 (నమస్తే తెలంగాణ): ప్రముఖ కవి, రచయిత, తెలంగాణ విముక్తి కోసం నిజాంతో పోరాటం చేసిన దాశరధి కృష్ణమాచార్యుల శతజయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ మాజీ సలహాదారు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కేవీ రమణాచారి కోరారు. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అన్న దాశరధి నినాదమే తెలంగాణ ఉద్యమంలో పెద్ద ఆయుధం అయ్యిందని గుర్తుచేశారు.
నిజామాబాద్ జైలులో బొగ్గుతో ఆయన రాసిన తెలంగాణ విముక్తి పోరాట గీతాలు స్ఫూర్తి రగిలించాయని చెప్పారు. ఈ నెల 22న దాశరధి జయంతిని పురస్కరించుకొని ప్రభుత్వం తక్షణం స్పందించాలని డిమాండ్ చేశారు.